అప్పుడే వైట్‍హౌస్‍ నుంచి వెళ్లిపోతా : ట్రంప్

Donald Trump says he will leave White House if electoral college votes for Joe Biden

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‍ను విజేతగా ఎలక్టోరల్‍ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తే తాను వైట్‍హౌస్‍ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను నిరాకరించడంతో పాటు పోలింగ్‍లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. నవంబర్‍ 3 ఓట్ల తర్వాత విలేకరుల మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ట్రంప్‍.. జనవరి 20న బైడెన్‍ను పాలనకు ముందు కాలానికి మాత్రమే సేవ చేస్తానని అంగీకరించారు. బైడెన్‍ విజయాన్ని ధ్రువీకరిస్తే వైట్‍హౌస్‍ నుంచి వెళ్లిపోతారా? అని ప్రశ్నించగా ట్రంప్‍ తప్పకుండా చేస్తాను.. ఆ విషయం నీకు తెలుసా? అన్నారు. కానీ, అలా చేసినట్లయితే వారు తప్పు చేసినట్లే అంగీకరించాడానికి చాలా కష్టం అన్నారు. ప్రస్తుతం (జనవరి) 20వ తేదీ మధ్య చాల విషయాలు జరగవచ్చని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు. వైట్‍హౌస్‍ విజేతను నిర్ణయించే ఎలక్టోరల్‍ కాలేజీ డిసెంబర్‍ 14న బైడెన్‍ గెలుపును సర్టిఫై చేయడానికి సమావేశం కానుంది.  ట్రంప్‍ 232, బిడెన్‍ 306 ఓట్లు వచ్చాయి.