అమెరికాలో.. 232 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి

Biden Picks Janet Yellen for Treasury Secretary

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‍ తన మంత్రివర్గాన్ని క్రమంగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రధానమైన శాఖలకు ఎంపిక కూడా జరిగింది. ట్రెజరీ కార్యదర్శిగా జనెట్‍ ఏలెన్‍ను ఎంపిక చేశారు. గతంలో సంక్షోభ సమయంలోనూ ఆర్థిక రంగం బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఈమెకు ఉన్నది. ఈ శాఖకు మహిళ నాయకత్వం వహించటం 232 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఏలెన్‍ గతంలో ఫెడరల్‍ రిజర్వు విధాన నిర్ణయ కమిటీలో సభ్యులుగా 2008-2009 సంవత్సరాల్లో బాధ్యతలు నిర్వహించారు.