ఆ భయంతోనే మెలానియా ట్రంప్ ఆలస్యం

reports-melania-will-not-leave-donald-trump-until-january

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ శ్వేతసౌధాన్ని వీడిన తరువాతే ఆయన సతీమణి మెలానియా విడాకుల విషయం గురించి ఆలోచిస్తారని ట్రంప్‍నకు రాజకీయ సహాయకురాలుగా పని చేసిన ఒమరోసా మానిగాల్ట్ న్యూమన్‍ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న సమయంలో విడిపోవడం గురించి ఆలోచిస్తే ట్రంప్‍ తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, మెలానియా అధికార ప్రతినిధులు మాత్రం ఒమరోసా వ్యాఖ్యలను ఖండించారు. ఇవన్నీ నిరాధార కథనాలు అంటూ కొట్టిపడేశారు.

డొనాల్డ్ ట్రంప్‍తో 15 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికేందుకు మెలానియా ఎదురుచూస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరద్దరి బంధం గురించి అన్‍హింగ్డ్ పేరిట రాసిన పుస్తకంలో ఒమరోసా ప్రస్తావించడం వీటికి బలం చేకూర్చింది. ట్రంప్‍, మెలానియా మధ్య భార్యభర్తల బంధం లేదని, అవసరం కోసమే కలసి ఉంటున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా విడాకులు తీసుకుంటున్నందుకు గాను ట్రంప్‍ తన మూడవ భార్య మెలానియాకు భరణం కింద సుమారు రూ.500 కోట్లు చెల్లించనున్నారని ఒమరోసా పేర్కొన్నారు. కాగా ట్రంప్‍-మెలానియా దాంపత్యానికి గుర్తుగా వారిద్దరికి బారన్‍ ట్రంప్‍ జన్మించాడు. అతడి వయస్సు ఇప్పుడు పద్నాలుగేళ్లు.