
అమెరికా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. ఉద్యోగాలు కోల్పోయాం, సాయం చేయాలంటూ ప్రభుత్వానికి లక్షల సంఖ్యలో ప్రతివారం అక్కడి కార్మిక శాఖకు దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించి వెల్లడైన సమాచారం ప్రకారం, ఉపాధి లేదు, ఉద్యోగం కోల్పోయాం, సాయం కావాలంటూ కార్మికశాఖకు 7,78,000 దరఖాస్తులు (నవంబరు 25 నాటికి) వచ్చాయి. క్రితం వారంతో పోల్చితే ప్రభుత్వ సాయం కోసం క్లెయిమ్ చేసుకున్నవారి సంఖ్య 30 వేలు పెరిగింది. దరఖాస్తుల సంఖ్య వరుసగా రెండోవారం పెరిగాయి. ఆర్థిక మాంద్యం, కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం వల్ల అమెరికాలో వర్తక, వాణిజ్య సంస్థలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. వివిధ రంగాల్లో పరిశ్రమలు హఠాత్తుగా మూతపడ్డాయి. దాంతో అనూహ్య స్థాయిలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి, ప్రభుత్వ సాయంకోసం క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.