
ఒక దేశం, ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) గురించి ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ప్రస్తావించారు. ఈ విధానం దేశానికి ప్రస్తుతం అవసరమన్నారు. తరచూ జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. గుజరాత్లోని కెవాడియాలో జరుగుతున్న చట్టసభల అధిపతుల 80వ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక కేవలం చర్చించి ఊరుకునే అంశం కాదని, దేశానికి ప్రస్తుతం అవసరమైన విషయమని అన్నారు.