ఓటు ద్వారా ప్రగతి : బైడెన్

joe-biden-appeals-for-unity-in-thanksgiving-eve-address

ప్రజాస్వామ్యం ఈ ఏడాది పరీక్షను ఎదుర్కొందని, అందులో విజయం సాధించిందని అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‍ అన్నారు. ఈ విషయంలో అమెరిక్లను తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారని ప్రశంసించారు. తన స్వస్థలం విల్మింగ్టన్‍లో ఆయన కృతజ్ఞతల సమర్పణ దినోత్సవ ప్రసంగాన్ని చేశారు. తొలుత మనం ప్రజాస్వామ్యానికే కృతజ్ఞత తెలుపుద్దాం. కరోనా మహమ్మారి విజృంభించినప్పటికీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అధిక సంఖ్యలో ప్రజలు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికన్ల హృదయాలు దేనిగురించి స్పందించాయో అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా. అది ప్రజాస్వామ్యం గురించే.. మన జీవితాలు, మన ప్రభుత్వం మన నాయకులను నిర్ణయించుకునే హక్కును ఉపయోగించుకున్నారు. గొంతు వినిపించుకునే హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఎదురయిన ఈ పరీక్షను దేశ వాసులు సమర్థంగా ఎదుర్కొన్నారు.

పూర్తి స్వేచ్ఛ, నిజాయితీతో ఎన్నికలు జరిగాయి. ఫలితాలను మనం గౌరవించాం. అహింసాయుత ఆయుధమైన ఓటు ద్వారా ప్రగతి సాధ్యమని దేశవాసులు మరోసారి నిరూపించారు.

మన హృదయాలు, చేతులు, గొంతుకల సాయంతో నిన్నటికంటే ఈ రోజు మరింత బాగుంటాం. రేపు అంతకంటే ఎక్కువగా బాగుంటామని జో బైడెన్‍ అన్నారు.

 


                    Advertise with us !!!