
అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి రెండు అత్యాధునిక డ్రోన్లను భారత్ లీజుకు తీసుకుంది. ఎంక్యూ-9బీ సీ గార్డియన్ గా పిలిచే ఈ డ్రోన్లను హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కార్యకలాపాలకు భారత నౌకాదళం సమర్థంగా వినియోగిస్తున్నది. 5,500 నాటికల్ మైళ్ల పరిధి, నిర్విరామంగా 35 గంటలు ఎగిరే సామర్థ్యం సీ గార్డియన్ సొంతం. తమిళనాడులోని అరక్కోణం నౌకాదళ స్థావరం నుంచి వీటిని ఆపరేట్ చేస్తున్నారు.