విదేశీ జంతువులకు అనుమతి తప్పనిసరి

permission-is-mandatory-for-foreign-animals

రాష్ట్రంలో విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ పేర్కొంది. డిసెంబర్‍ 2లోగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వెబ్‍సైట్‍లోని పరీవేష్‍లో అనుమతి కోసం నమోదు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లను అప్‍లోడ్‍ చేయాల్సిన అవసరం లేదని సృష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో మాత్రం సంబంధిత వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‍) శోభ తెలిపారు.