మ్యూజిక్ పాఠశాలకు ఎస్పీ బాలు పేరు

ap-govt-issued-orders-naming-nellore-govt-music-and-dance-school-with-the-name-of-sp-balasubrahmanyam

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని నెల్లూరులోని మ్యూజిక్‍, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలను డాక్టర్‍ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్‍, డ్యాన్స్ పాఠశాలగా పేరు మార్పు చేస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టూరిజం, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‍ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.