ఏపీ శాసనసభ సమావేశాలు తేదీలు ఖరారు

Andhra Legislative Assembly's winter session from Nov 30

ఆంధప్రదేశ్‍లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‍ బిశ్వభూషణ్‍ హరిచందన్‍ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‍ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్‍లో వెల్లడించారు.