తమకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు : కేటీఆర్

KTR Addressing The Media at LB Stadium

మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని టీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍, మంత్రి కేటీఆర్‍ సృష్టం చేశారు. గ్రేటర్‍ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న జరగనున్న సీఎం కేసీఆర్‍ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వస్తూ పోతుంటాయని.. కానీ నగరంలో శాంతియువత వాతావరణం ఉండే చూడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. ప్రభుత్వం నడుపుతున్న తమకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని చెప్పారు. మతపరమైన అంశాలతో అశాంతిని నెలకొల్పాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీఎం కేసీఆర్‍ పేదల పక్షపాతి అని, వారి పట్ల తన నిబద్ధతను ఇప్పటికే చాటుకున్నారని వివరించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కేటీఆర్‍ విజ్ఞప్తి చేశారు.