అమెరికాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ?

A second wave of coronavirus may force renewed lockdowns

అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి చెందడం మొదలు అయినప్పటి నుంచి మొదటిసారిగా గడిచిన రెండు వారాలలో ప్రతి వారం అమెరికాలో పదిలక్షలకు పైగా కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత వారంలో అమెరికాలో సగటున 173,000 కొత్త రోజువారీ కరోనావైరస్ కేసులను నమోదు కాగా.ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే 2020 నవంబర్ పూర్తి నెలలో నమోదైన మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4.5 మిలియన్లకు చేరుకుంటుంది మరియు ఈ సంఖ్య మునుపటి నెలల కంటే రెట్టింపు సంఖ్య గా న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది.

అయితే కరోనావైరస్ చికిత్సలు మెరుగుపడినప్పటికీ రాబోయే వారాల్లో కరోనావైరస్ మరణాల సంఖ్య అఛ్చాధికంగా ఉంటుందని కొందరు ఎపిడెమియాలజిస్టులు అంచనా వేస్తున్నారు.కరోనా వైరస్ ప్రారంభ దశలో అమెరికా అంతటా ప్రజారోగ్య కార్యకర్తలు రద్దీగా ఉండే రెస్టారెంట్ల దగ్గరనుంచి రద్దీగా ఉండే మాంసం ప్యాకింగ్ ప్లాంట్ల వరకు ఏ ఒక్క ప్రదేశాలు వదలకుండా COVID-19 పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులు తిరిగిన ప్రదేశాలలో కాంటాక్ట్ ట్రేసర్ పద్దతిని పాటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో చాలా వేగంగా వ్యాపించడంతో కరోనా వైరస్ అధికంగా ఉన్న రాష్ట్రలలో స్థానిక ఆరోగ్య అధికారులు తిరిగి కాంటాక్ట్ ట్రేసర్ ప్రయత్నాలను అమలు లో పెడుతున్నారు.

ఒక అంటు వ్యాధి వ్యాప్తి చెందడానికి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రసారం యొక్క బాటను బహిర్గతం చేయడం ఒక ముఖ్య సాధనం గా భావించి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన 48 గంటలలోపు కరోనా వైరస్ సోకిన వ్యక్తి కి శిక్షణ పొందిన కాంటాక్ట్ ట్రేసర్ నుండి ఫోన్ కాల్ అందుకుంటారు. అతను ఒక వివరణాత్మక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆపై రోగి బహిర్గతం అయిన ప్రతి కొత్త వ్యక్తిని గుర్తించి వారిని  క్వారంటైన్ కి పంపడం మరియు వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయిస్తారు.

అయితే అమెరికాలో రెండు వారాలలోపు రెండు మిలియన్ల కొత్త కేసులను నమోదు అవడంతో మరియు 42 రాష్ట్రాలు నిరంతర కరోనా వైరస్ కేసుల పెరుగుదలను నమోదు చేయడంతో ప్రజారోగ్య సంస్థలు వాస్తవికంగా వ్యాప్తి మూలాలను అరికట్టే దానిపై కఠినమైన ఎంపికలు చేస్తున్నాయి మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలు ఇకపై చేయలేవని ప్రజారోగ్య సంస్థలు అంగీకరిస్తున్నాయి.

కాని సోమవారం 23 నవంబర్ 2020 సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కరోనా వైరస్ కట్టడి పై కొత్త మార్గదర్శకత్వాన్ని విడుదల చేసింది గత ఆరు రోజులలో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులపై మరియు ముఖ్యంగా ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిపై కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలను కేంద్రీకరించాలని ఆరోగ్య విభాగాలకు పిలుపునిచ్చింది మరియు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన 14 రోజుల దాటితే ఆ రోగుల పై కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ అమలు చేయాల్సిన అవసరం లేదు అని కొత్త మార్గదర్శకత్వం తెలిపింది.

పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాలు వాటి ట్రేసింగ్ ప్రోటోకాల్‌లను ఇప్పటికే సవరించినట్లు మరియు వారు C.D.C. యొక్క కొత్త మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించారు.

కాని ఉత్తర డకోటాలో కరోనా వైరస్ బహిర్గతం అయినా ప్రతి ఒక్కరితో తాము ఇకపై కాంటాక్ట్ ట్రేసింగ్ చలేమని రాష్ట్ర అధికారులు గత నెలలో చెప్పాగా. సమూహాలను గుర్తించడంలో మరియు అంటువ్యాధులు ఎలా మరియు ఎక్కడ వ్యాప్తి చెందుతున్నాయో విస్తృత ఆకృతులను నిర్ణయించడంలో కాంటాక్ట్ ట్రేసింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ప్రజారోగ్య నిపుణులు ఆశాభావంవ్యక్తం చేశారు.

 


                    Advertise with us !!!