అంతర్జాతీయ విమానాలపై కేంద్రం కీలక నిర్ణయం

India restricts international flights till 31 December only selected flights allowed

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‍ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులను అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్‍ జనరల్‍ ఆఫ్‍ సివిల్‍ ఏవియేషన్‍ (డీజీసీఏ) వెల్లడించింది. కొవిడ్‍ 19కు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్‍ విడుదల చేసింది. జూన్‍ 26న విడుదల చేసిన సర్క్యులర్‍ మార్పులు చేస్తున్నామని, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై డిసెంబర్‍ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవు.

 


                    Advertise with us !!!