యాప్‍లపై భారత్ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాం

China says India s latest app ban order violates WTO rules

తమ దేశానికి చెందిన 43 యాప్‍లపై భారత్‍ తాజాగా నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యను తాము విసృష్టంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. భారత్‍ పక్షపాత ధోరణిని వీడాలని ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినకుండా చూడాలని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయంటూ అలాబాబా గ్రూపునకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ యాప్‍ అలీ ఎక్స్ ప్రెస్ సహా చైనా మూలాలున్న 43 యాప్‍లపై కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‍ మీడియాతో మాట్లాడుతూ దేశ భద్రత నెపంతో చైనా మూలాలున్న యాప్‍లపై ఈ ఏడాది జూన్‍ నుంచి ఇప్పటివరకు నాలుగు దఫాలుగా భారత్‍ కొరడా ఝళిపించింది. ఇలా చేయడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘించడమే. చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను భారత్‍ హరించినట్టే అని పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!