24 గంటల్లో 64 లక్షల డోసుల పంపిణీ : అమెరికా

US to distribute 6.4 million doses of Pfizer

ఫైజర్‍ వ్యాక్సిన్‍కు అనుమతి రాగానే 24 గంటల్లో 64 లక్షల డోసుల వ్యాక్సిన్‍ పంపిణీకి అమెరికా ప్రణాళికలు తయారు చేస్తోంది. మొదట కరోనా పోరులో ముందున్న వారికి వ్యాక్సిన్‍ అందిస్తారు. రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన డోసుల్ని పంపిణీ చేస్తారు. అమెరికా మొత్తం మీద 20 మిలియన్ల మంది ఫ్రంట్‍లైన్‍ వర్కర్స్ ఉన్నారని, కొవిడ్‍ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న బ్యూరో ఆఫ్‍ ప్రిజన్స్, నేషనల్‍ హెల్త్ సర్వీస్‍, వెటరన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్‍ వంటి ఫెడరల్‍ విభాగాలకూ అందజేస్తామని ఆపరేషన్‍ వార్స్ స్పీడ్‍ ప్రాజెక్టులో పంపిణీ విభాగానికి బాధ్యత వహిస్తున్న జనరల్‍ గుస్తావా పెర్నా తెలిపారు. ఫైజర్‍ నుంచి 40 మిలియన్‍ డోసులు, మోడెర్నా నుంచి 20 మిలియన్‍ డోసుల కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఏప్రిల్‍ నాటికి ప్రతి పౌరుడికి టీకా అందుబాటులోకి వస్తుందని అక్కడ అధికారులు అంచనా వేశారు.

 


                    Advertise with us !!!