
ఎంపీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్‌కు దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ సవాల్ విసిరారు. హిందువుల ఆరాధ్య దైవం అయిన పీవీ, ప్రజా నాయకుడు ఎన్టీఆర్ సమాధులు కూల్చేస్తారా? దుమ్ముంటే కూల్చండి. మీరు కూల్చిన రెండు గంటల్లోనే దారుసలంని బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు. దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో ఎందుకు రీసౌండ్ వస్తుంది. టీఆర్ఎస్ స్క్రిప్ట్‌ని దారుసలాంలో చదువుతున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నల్ల జెండాలు పట్టుకున్న వారిపై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.