సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కియా ప్రతినిధులు

kia-motors-officials-meet-cm-jagan

కియా మోటార్స్ ప్రతినిధులు ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కియో మోటార్స్, ఇండియా ఎండీ కూక్‍ హ్యూన్‍ షిమ్‍, కియా మోటార్స్ లీగల్‍ హెచ్‍వోడీ జుడే లి, ప్రిన్సిపల్‍ అడ్వైజర్‍ డాక్టర్‍ సోమశేఖర్‍ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు.