దాసుభాషితం వారి CPB-SPB తెలుగు పోటీ- తెలుగునాట 10వ తరగతి పిల్లలకీ, ప్రపంచవ్యాప్తంగా అందరికీ

CPB SPB Telugu Commutations

తెలుగు భాషా, సాహిత్యాలని అనేక కోణాలలో ఆవిష్కరిస్తూ, తమ “”సంగీత, సాహిత్య, కళల ‘శ్రవణ’ కథ భాండాగారం” అనబడే శ్రవణ పుస్తకాల యాప్ ద్వారా దాసుభాషితం వారు చేస్తున్న సాహిత్య సేవ ప్రశంసనీయం. వారి సేవలు నాకు సుపరిచితమే!. కేవలం శ్రవణ పుస్తకాలని ప్రచారం చెయ్యడం తోటే ఆగకుండా తెలుగు భాష మీద ఆసక్తిని పెంపొందించడానికి దాసుభాషితం వారు పోటీలు కూడా నిర్వహించడం ముదావహం. ఆ పోటీలలో కూడా దాసుభాషితం వారు అవలంబిస్తున్న సాంకేతిక విధానాలు మెచ్చుకోదగ్గవి. అలా భావించే గత సంవత్సరం “దాసుభాషితం CPB బహుమతి”  పోటీకి ఎంతో ప్రొత్సాహాన్ని ఇచ్చిన ఎస్. పి. బాల సుబ్రమణ్యం ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన గౌరవార్ధం, ఆయన ఆశయాలకి అనుగుణంగా ఈ ఏడు ఆ పొటీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ “దాసుభాషితం SPB బహుమతి” పోటీని అదనంగా ప్రకటించారు దాసుభాషితం సంస్థ వారు.  ఈ రెండు పోటీలకీ బహుమతి మొత్తం అక్షరాలా చెరొక లక్ష రూపాయలు.  వీటిల్లో CPB పోటీ భారత దేశం లోని 10వ తరగతి పిల్లలకి అయితే, SPB పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దలు కూడా పాల్గొని, తమ భాషా,సాహిత్య పటిమ తో పోటీలో నెగ్గి బహుమతులు పొందవచ్చును. అన్ని పోటీలూ ఆన్-లైన్ లోనే.

పోటీలకి నమోదు తేదీ; December 10, 2020
పోటీలు నిర్వహించబడే తేదీ: December 13, 2020

నమోదు వివరాలు: https://www.dasubhashitam.com/

ఈ పోటీల గురించి కొన్ని వివరాలకి ఈ క్రింది వీడియోలు చూడండి. నమోదు వివరాలకి జత పరిచిన ప్రకటన చూడండి.

  1. శ్రీ ఎస్.పీ బాలసుబ్రమణ్యం: పోటీల ప్రాముఖ్యత గురించి వివరణ(వీడియో)

         https://www.youtube.com/watch?v=6q28SAIP7Y4&feature=emb_logo

  1. శ్రీ అశోక్ తేజ; “ఈ పొటీ పదవ తరగతి పిల్లలకే ఎందుకు?”- వివరణ (వీడియో)

        https://www.youtube.com/watch?v=4jM8CqBQXoQ&feature=emb_logo

  1. శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ: “పోటీలు జరిగే విధానం”- వివరణ (వీడియో)

https://www.youtube.com/watch?v=tkb4TcuEErM&feature=emb_logo

  1. శ్రీ అనంత శ్రీరామ్: “విజేతల ఎంపిక ఎలా? – వివరణ (వీడియో)

https://www.youtube.com/watch?v=2u1r6Qwe7Wo&feature=emb_logo

పై వీడియోలూ, పోటీల నిబంధనలు, బహుమతులు, తదితర వివరాలకీ 12 అంశాలతో కూడిన దాసుభాషితం వారి అధికారిక ప్రకటనఈ క్రింది లింక్ లో చూడండి.

https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about

దాసుభాషితం వారి “‘CPB-SPB తెలుగు పోటీ’ లో తెలుగునాట 10వ తరగతి పిల్లలూ, ప్రపంచవ్యాప్తంగా పెద్దలూ, పిల్లలూ పాల్గొని బహుమతులు గెల్చుకుని తెలుగు భాషా, సాహిత్యాల పురోభివృధ్ధికి తోడ్పడమని కోరుతూ....

వంగూరి చిట్టెన్ రాజు
హ్యూస్టన్, టెక్సస్, USA