నింగికేగిన అర్జెంటీనా సాకర్ లెజెండ్ డియెగో మారడోనా

diego-maradona-dies-at-60-sports-fraternity-reacts-with-tributes

మాజీ అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ మరియు మేనేజర్ సాకర్ లెజెండ్ డియెగో మారడోనా మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. లెజెండ్ మారడోనా యొక్క దీర్ఘకాల ఏజెంట్ మాటియాస్ మోర్లా బుధవారం 25 నవంబర్ 2020 న  మారడోనా మరణాన్ని ESPN ద్వారా ధృవీకరించారు.

ఈ నెల ప్రారంభంలో లెజెండ్ మారడోనా కు నవంబర్ 11 2020 బుధవారం న మెదడు లో రక్తం గడ్డ కట్టకి నందుకు విజయవంతం గా శస్త్రచికిత్స చేసినట్లు బిబిసి తెలిపింది.

అర్జెంటీనాకు 1986 సాకర్ ప్రపంచ కప్ టైటిల్‌ అందించి ప్రపంచ వ్యాప్తం గా మారడోనా మంచి కెప్టెన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. క్లబ్ స్థాయిలో మారడోనా ప్రముఖ యూరోపియన్ క్లబ్‌లు అయినా బార్సిలోనా మరియు నాపోలి తరపున కూడా ఆడారు.

"హ్యాండ్ ఆఫ్ గాడ్" ఐకానిక్ గోల్ కి ప్రసిద్ధ అయినా మారడోనా నాలుగు ప్రపంచ కప్‌లతో సహా అర్జెంటీనా తరఫున ఆడిన 96 అంతర్జాతీయ సాకర్ మ్యాచ్‌లలో 34 గోల్స్ చేశారు.

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ బుధవారం 25 నవంబర్ 2020 న అధ్యక్షులు క్లాడియో టాపియా ద్వారా విడుదల చేసిన సంతాప ప్రకటన ద్వారా లెజెండ్ డియెగో అర్మాండో మారడోనా మరణం పట్ల తమ బాధను వ్యక్తం చేస్తుంది.

 


                    Advertise with us !!!