అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా ప్రవర్తించడం ‘టామ్‌బాయ్‌’ ల నైజం : పోడ్ కాస్ట్ లో పూరి జగన్నాధ్

TOMBOY Puri Musings by Puri Jagannadh

మన సమాజంలో అబ్బాయిలతో పోటీపడే అమ్మాయిలు చాలా మందే ఉంటారు. సాధారణంగా మనం వాళ్లను మగరాయుళ్లు అంటుంటాం. అలాంటి అమ్మాయిల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు పూరి జగన్నాథ్. అమ్మాయిలంతా ఒకేలా ఉండరు. కొంత మంది అమ్మాయిల ప్రవర్తనలో తేడా ఉంటుంది. వాళ్లు అమ్మాయిల్లా కాకుండా అబ్బాయిల్లా ప్రవర్తిస్తారు. అబ్బాయిలతో పోటీపడుతుంటారు. అస్సలు సిగ్గుపడరు. దురుసుగా వెళ్లుపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలను మన సమాజంలో మగరాయుళ్లు అంటుంటారు. ఇంగ్లిష్‌లో ‘టామ్‌బాయ్’ అంటారట. ఈ టామ్‌బాయ్‌ల గురించి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ మేరకు టామ్‌బాయ్ పాడ్‌కాస్ట్ చేశారు‘‘అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా ప్రవర్తించడం. అబ్బాయిలు చేసే పనుల మీద ఆసక్తి చూపించడం. ఆఖరికి వాళ్లు అబ్బాయిల్లానే బట్టలు వేసుకుంటారు. అలా అని వాళ్లలో స్త్రీతత్వం లేదని కాదు. ఉంటుంది.. కానీ, మిగతా అమ్మాయిల మాదిరిగా ఎక్కువ సేపు అద్దం ముందు కూర్చోవడం, గంటలు తరబడి మేకప్‌లు ఉండవు. డ్రెస్సింగ్ కూడా ఎవ్వరినీ ఎట్రాక్ట్ చేయడం కోసం చేయరు. వాళ్లకు నచ్చినట్టుగా సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు. టామ్‌బాయ్స్ ఎప్పుడూ సిగ్గుపడరు. ధైర్యంగా మాట్లాడతారు. తిట్టాలనిపిస్తే మనస్ఫూర్తిగా మీకంటే బాగా బూతులు తిట్టగలరు’’ అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా టామ్‌బాయ్స్ డ్రామా క్వీన్స్‌లా ఉండరని పూరి అన్నారు. ఏదున్నా మొహం మీదే చెప్పేస్తారని, కలల్లో బతకరని, చాలా ప్రాక్టికల్‌గా ఉంటారని వెల్లడించారు. ‘‘టామ్‌బాయ్స్ బాగా డబ్బులున్నవాడి కోసం ట్రై చేయరు. పార్టీ దొరికితే పెళ్లి చేసుకుని పోదామని చూడరు. అమ్మానాన్నని ఎలా పెంచాలో ఆలోచిస్తారు. ఏ బిజినెస్ చేద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్లెప్పుడూ ఫ్యామిలీ కోసం నిలబడతారు. ఐ లవ్ టామ్‌బాయ్స్’’ అని పూరి చెప్పారు.

‘‘అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా ప్రవర్తించడం. అబ్బాయిలు చేసే పనుల మీద ఆసక్తి చూపించడం. ఆఖరికి వాళ్లు అబ్బాయిల్లానే బట్టలు వేసుకుంటారు. అలా అని వాళ్లలో స్త్రీతత్వం లేదని కాదు. ఉంటుంది.. కానీ, మిగతా అమ్మాయిల మాదిరిగా ఎక్కువ సేపు అద్దం ముందు కూర్చోవడం, గంటలు తరబడి మేకప్‌లు ఉండవు. డ్రెస్సింగ్ కూడా ఎవ్వరినీ ఎట్రాక్ట్ చేయడం కోసం చేయరు. వాళ్లకు నచ్చినట్టుగా సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు. టామ్‌బాయ్స్ ఎప్పుడూ సిగ్గుపడరు. ధైర్యంగా మాట్లాడతారు. తిట్టాలనిపిస్తే మనస్ఫూర్తిగా మీకంటే బాగా బూతులు తిట్టగలరు’’ అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా టామ్‌బాయ్స్ డ్రామా క్వీన్స్‌లా ఉండరని పూరి అన్నారు. ఏదున్నా మొహం మీదే చెప్పేస్తారని, కలల్లో బతకరని, చాలా ప్రాక్టికల్‌గా ఉంటారని వెల్లడించారు.

‘‘టామ్‌బాయ్స్ బాగా డబ్బులున్నవాడి కోసం ట్రై చేయరు. పార్టీ దొరికితే పెళ్లి చేసుకుని పోదామని చూడరు. అమ్మానాన్నని ఎలా పెంచాలో ఆలోచిస్తారు. ఏ బిజినెస్ చేద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్లెప్పుడూ ఫ్యామిలీ కోసం నిలబడతారు. ఐ లవ్ టామ్‌బాయ్స్’’ అని పూరి చెప్పారు. టామ్‌బాయ్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం మగాళ్లకు చాలా ఈజీ అని పూరి అన్నారు. మగాళ్లను టామ్‌బాయ్స్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారట. మగాళ్లతోనే ఉంటారని, మగాళ్లతోనే పోటీ పడతారని, సొసైటీని అస్సలు పట్టించుకోరని చెప్పారు. టామ్‌బాయ్స్ లోపల చాలా ఫైర్ ఉంటుందని, టెస్టోస్టిరాన్ లెవల్స్ మగాళ్ల కంటే ఎక్కువగా ఉంటాయని పూరి వెల్లడించారు. ఒలింపిక్స్‌లో పరిగెత్తడానికి, గుర్రాలపై స్వారీ చేయడానికి, కార్లు, బైకులు నడపడానికి ఇదే కారణమన్నారు.

‘‘జిమ్ముల్లో డ్రామా క్వీన్స్ లిప్‌స్టిక్స్ రాసుకుంటుంటే ఈ టామ్ బాయ్స్ మగాళ్లతో పోటీగా వర్కౌట్ చేస్తుంటారు. వాళ్లతో మగాళ్లు మిస్ బిహేవ్ చేయలేరు. చెయ్యనివ్వరు. మీరు వాళ్లను రేప్ చేయలేరు. ఎందుకంటే వాళ్లు రెబల్స్. ఆఫీసులో మీ పక్క డెస్క్‌లో పనిచేస్తుంటారు. అర్ధరాత్రి రోడ్డుపై నిలబడి ట్యాక్సీ ఆపుతుంటారు. పార్టీ తరవాత ఫ్రెండ్స్ అందరినీ ఇళ్లలో డ్రాప్ చేసి చివరిగా తనొక్కతే ఇంటికి వెళ్లేది టామ్‌బాయ్’’ అంటూ పూరి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇంట్లో అమ్మాయి మగరాయుడిలా ఉంటే వాళ్లను అస్సలు ఆపొద్దని తల్లిదండ్రులకు సూచించారు పూరి. మనకు నూర్ ఇనాయత్ ఖాన్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరస్వతి రాజామణి, పూలన్‌దేవి, కిరణ్ బేడి, కరణం మల్లీశ్వరి.. ఇలాంటి వాళ్లు మనకు కావాలి అని అభిప్రాయపడ్డారు పూరి. కళ్లలో కసి, పట్టుదల ఉన్న ఆడవాళ్లే నిజమైన అందగత్తెలు అని అన్నారు. టామ్‌బాయ్స్ గురించి పూరి చెప్పిన మరిన్ని విషయాలు కింది వీడియోలో వినొచ్చు.