
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నెవార్క్లో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా కేర్స్ ఆధ్వర్యంలో వివిధ చోట్ల తానా నాయకులు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కాలిఫోర్నియా స్టేట్లోని నెవార్క్లో తానా-బాటా నాయకులు లీగ్ ఆఫ్ వలంటీర్స్ ఫుడ్ ప్యాంట్రీకి ఆహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా తానా నాయకులు ఫుడ్ ప్యాంటీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, భక్తబల్లా, రజనీకాంత్ కాకర్ల, రామ్ తోట తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల కూడా ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూడా వారు తెలిపారు.