
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం అధునాతన హంగులతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఎయిరిండియా వన్-బీ777 విమానాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. అనంతరం ఆ విమానంలోనే సతీసమేతంగా చెన్నైకి బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.