28 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు 107 కోట్లు

Centre okays Rs 107.42cr grant for 28 food processing projects

దేశవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన ఫుడ్‍ ప్రాసెసింగ్‍ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం రూ.107.42 కోట్ల నిధులను విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ.320 కోట్లు కాగా, వీటిలో రూ.107.42 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్‍ ఇండస్ట్రీస్‍ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మధ్యప్రదేశ్‍తో పాటు గుజరాత్‍, ఉత్తరప్రదేశ్‍, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ఫుడ్‍ ప్రాసెసింగ్‍ యూనిట్ల నుంచి ప్రతిరోజు 1,237 టన్నులు ఉత్పత్తి కానున్నది.