ఐటీ వ్యయం పుంజుకుంటుంది...

IT spending in India to grow 6% in 2021 to $81.9 billion: Gartner

వచ్చే ఏడాది దేశంలో ఐటీ వ్యయం 6 శాతం పెరిగి 81.9 బిలియన్‍ డాలర్లకు చేరుకోవచ్చని రిసెర్చ్ సంస్థ గార్ట్నర్‍ అంచనా వేసింది. ఈ ఏడాదితో పోల్చితే రాబోయే సంవత్సరంలో ఎంటర్‍ప్రైజ్‍ సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసెస్‍ వంటి విభాగాల్లో వృద్ధిరేటు పుంజుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ ఏడాది 79.3 బిలియన్‍ డాలర్ల ఐటీ ఖర్చులు ఉండొచ్చన్న గార్ట్నర్‍.. గతేడాదితో చూస్తే ఇది 8.4 శాతం తక్కువని తెలిపింది. ‘కరోనా వైరస్‍తో ఎన్నో డిజిటల్‍ ట్రాన్స్‌ఫార్మేషన్  ప్రాజెక్టులు ఆగిపోయాయి. మార్కెట్‍లో అనిశ్చితి, తగ్గిన నగదు ప్రవాహంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి’ అని గార్ట్నర్‍ రిసెర్చ్ ఉపాధ్యక్షుడు అరుప్‍ రాయ్‍ అన్నారు.