
అయోధ్య విమానాశ్రయం పేరు మారనుంది. విమానాశ్రయం పేరు మార్పుకు ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయోద్య విమానాశ్రం ఇక నుంచి మర్యాద పురోషత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా పిలవనున్నారు. దీనికి రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా మద్దతు లభించింది. మంత్రి మండలి ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ నుంచి భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా ట్వీట్ చేశారు.