ఎన్నారైస్ ఫర్ అమరావతికి బాబురావు విరాళం 10లక్షలు

Doddapaneni Babu Rao Donates 10 lakh to NRIs for Amaravati

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేయనున్న మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, ఒక రాష్ట్రం-ఒక రాజధాని' అన్న నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు, ఉద్యమానికి ఎన్నారైలు తమ వంతగా సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నారై, డాక్టర్‌ బాబురావు దొడ్డపనేని ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతికి రూ.10 లక్షలు విరాళమిచ్చారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ఎన్నారైలు రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ బాబురావు దొడ్డపనేని రూ.10లక్షలు విరాళమిచ్చారు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన బాబురావు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోయినా మాత భూమిపై ఉన్న మమకారంతో రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయం చేశారు.