
జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దుబ్బాక ఎన్నికల విజయంతో ఊపుమీద ఉన్న పార్టీ గ్రేటర్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలన్న పకడ్బందీ వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారు. ఓ పక్క ఇతర పార్టీలకు చెందిన టికెట్రాని ఆశావావులను పార్టీలో చేర్చుకుంటూ మరో పక్క ప్రచారంపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన జాతీయ నాయకులు, యువజన నేతలతో పాటు మంత్రులను సైతం ప్రచారాని కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీనటి విజయశాంతి ఆ రోజు వారి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం ఆమే బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సైతం రూటుమ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం.