కేటీఆర్ ఈ విషయంలో చర్చకు సిద్ధమా ? : మురళీధర్‍రావు

BJP dumps TRS manifesto in dustbin says change is imminent

జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతుందని కేసీఆర్‍, కేటీఆర్‍కు వ్యతిరేకంగా ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‍రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలవడం.. గ్రేటర్‍ పోరులో బీజేపీ ప్రధానశక్తిగా మారడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఉచిత తాయిలాలు ప్రకటించారని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‍ఎస్‍ ఎన్నికల ప్రణాళికను రీసైకిల్డ్ కాపీగా ఆభివర్ణించారు. ఉచితంగా నీళ్లు వంటి తాయిలాలు తప్ప, 2016లో ప్రకటించినదానికి ఇప్పుడు విడుదల చేసినదానికి తేడా లేదు అంటూ టీఆర్‍ఎస్‍ మెనిఫెస్టోను చెబ్తబుట్టలో వేశారు. టీఆర్‍ఎస్‍కు ఇదే చివరి ప్రభుత్వమని, గ్రేటర్‍ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‍ మాయమైపోతుందని వ్యాఖ్యానించారు. కేంద్రానికి రూపాయిస్తే ఆఠాణాయే వస్తుంనది కేటీఆర్‍ ఈ విషయంలో చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.5,000 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నది కేంద్రమే. టీఆర్‍ఎస్‍ హామీ ఇచ్చిన నిజాం సుగర్‍ ఫ్యాక్టరీ ఏమైంది అని మురళీధర్‍రావు ప్రశ్నించారు.

 


                    Advertise with us !!!