కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు...

Can Dogs Detect Coronavirus And Control Pandemic

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు శునకాల సాయం తీసుకుంటున్నాయి. కరోనా ఇన్‍ఫెక్షన్‍ వాసనని శునకాలు పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే. యూఏఈ, ఫిన్‍ల్యాండ్‍, లెబనాన్‍ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్‍ విమానాశ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్లుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు.