విదేశీయులకు బ్రిటన్ ప్రభుత్వం ఆఫర్

UK extends work visas for Indian foreign doctors and nurses

భారతీయులతో సహా బ్రిటన్‍లో ఉండే విదేశీ డాక్టర్లు, నర్సుల వీసా గడువును ఏడాది పోడగిస్తున్నట్లు బ్రిటన్‍ అధికారిక ప్రకటన చేసింది. 2021 మార్చి 31తో ముగియనున్న వీసాలు మరో సంవత్సరం చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొద్ది నెలల కిందట కూడా ఇలాంటి ప్రకటన చేసింది. 2020 మార్చి-అక్టోబర్‍తో ముగియనున్న వీసా గడువును పొడగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 6000 మంది డాక్టర్లతో పాటు, నర్సులు, పారామెడిక్స్, ఆయాలు, థెరపిస్టులు, సైకాలజిస్టులు, ఆరోగ్య నిపుణుల వీసాలు ఉచితంగా గడువు పెంపునకు అర్హత పొందినట్లుయింది. క్లిష్ట సమయంలో విదేశీ ఆరోగ్య నిపుణుల భాగస్వామ్యాన్ని మేము గుర్తిస్తున్నామని బ్రిటన్‍ హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‍ తెలిపారు. వీసా గడువు పొడగింపు కోరుకునే వారు ఆన్‍లైన్‍ దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది.

 


                    Advertise with us !!!