
అమెరికన్ పారిశ్రామికవేత్త, టెస్లా సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ (49) సంపద నానాటికీ గణనీయంగా వృద్ధి చెందుతున్నది. టెస్లా షేర్ల విలువ భారీగా పుంజుకోవడంతో తాజాగా ఆయన నికర సంపద 7.2 బిలియన్ డాలర్లు (రూ.53,353 కోట్లు) పెరిగింది. ఈ ఏడాది మొత్తం మీద డాలర్లు (రూ.7,43,249 కోట్లు) వృద్ధి చెంది 127.9 బిలియన్ డాలర్ల (రూ.9,47,771 కోట్ల)కు ఎగబాకింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్గేట్స్ (127.7 బిలియన్ డాలర్లు)ను వెనకుక నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.