పుట్టు చికెన్ కూర వండి వడ్డించిన హీరోయిన్ రష్మిక మందన

Rashmika Mandanna cooks chicken puttu curry on Upasana

మెగా కోడలు ఉపాసన స్టార్ట్ చేసిన ‘‘యువర్ లైఫ్’’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక గెస్ట్ ఎడిటర్ గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్ కు చెబుతూ, ఆరోగ్యకరమైన రెసిపీ లను వండుతూ తన స్టైల్లో ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా చికెన్ తో ‘‘కోలీ పుట్టు’’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన, నటి గానే కాకుండా చెఫ్ గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చింది. రష్మిక కు ఇంకా పెళ్లి కాలేదనీ, మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే..రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీ గా ప్రశంసించింది ఉపాసన కొనిదెల. ఇలా రష్మిక, ఉపాసన సరదా సంభాషణలతో ఈ వీడియో ఇప్పుడు నెట్ లో సందడి చేస్తోంది.