తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

president-ram-nath-kovind-offers-prayers-to-sri-venkateswara-swamy-at-tirumala

రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న రాష్ట్రపతికి పద్మావతీ అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‍రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతి దంపతులకు అర్చకులు ఇస్తెకఫాల్‍ స్వాగతం పలికారు. అనంతరం వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‍ బిశ్వభూషణ్‍ హరిచందన్‍ ఉన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.