
తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆంధప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.