
ఆంధప్రదేశ్ ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేసి తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. కోడుమూరులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో నది స్నానం లేకుండా పోలీసులు, అధికారులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉన్న అనుమతి, ఆంధప్రదేశ్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హిందుత్వాన్ని కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుండ్రేవు ఎత్తిపోతల పథకం కోసం రైతులతో కలిసి జనవరిలో పాదయాత్ర చేస్తామన్నారు.