
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో దయనీయంగా మైనార్టీల పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 17 నెలల కాలంలో ముస్లిం సోదరులపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయమన్నారు. రేయింబవళ్లు మసీదుల నిర్వహణ చూసేటటువంటి మౌజమ్ లపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.