
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నిరుపేదల సహాయార్థం నిర్వహిస్తున్న ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి అన్నీచోట్ల నుంచి అభినందనలు, ప్రశంసలు వస్తోంది. తానా మిడ్ అట్లాంటిక్ విభాగం వివిధ చోట్ల చేస్తున్న ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలను అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా తానా మిడ్ అట్లాంటిక్ నాయకులు కాలేజ్విల్లేలోని డైలీ బ్రెడ్ కమ్యూనిటీ ఫుడ్ ప్యాంట్రీకి ఆహారపదార్థాలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్యాంట్రీ నిర్వాహకులు తానా ఇచ్చిన విరాళానికి ధన్యవాదాలు చెబుతూ, తానా చేస్తున్న సేవలను ప్రశంసించారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, కమిటీ సభ్యులు సతీష్ తుమ్మల, కృష్ణ కొనగళ్ళ, రంజిత్ మామిడి ఈ ఆహారపదార్థాలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇతర చోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు తానా నాయకులు తెలిపారు.