25కోట్ల బడ్జెట్‌తో విజయ్‌ ఆంటోని 'జ్వాలా'

Vijay Antony s Jwala to be made at a cost of Rs 25 Cr

‘బిచ్చగాడు’చిత్రంతో తెలుగులో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని. తెలుగులో ‘జ్వాలా’గా, తమిళ్‌లో ‘అగ్ని శిరగుగళ్‌’ ద్విభాషా చిత్రంగా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన అక్షరహాసన్‌ నటిస్తుండగా ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్‌ కీలకపాత్ర చేస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్‌.యమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  తెలుగులో శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై  జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకంపై యమ్‌.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  

ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్‌ దేశాలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న భారీబడ్జెట్‌ చిత్రమిది అన్నారు నిర్మాతల్లో ఒకరైన యమ్‌.రాజశేఖర్‌ రెడ్డి. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ కలకత్తాలో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. విజయ్‌ ఆంటోని కెరీర్‌లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలిచిత్రమిది. రీమాసేన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం– నటరాజన్‌.

 


                    Advertise with us !!!