టీఆర్‍ఎస్‍కు వీఆర్ఎస్ ఇవ్వాలి : ఎల్.రమణ

TDP releases manifesto for GHMC election 2020

తెలంగాణలో ఎల్‍ఆర్‍ఎస్‍, బీఆర్‍ఎస్‍ రద్దు కావాలంటే టీఆర్‍ఎస్‍కు వీఆర్‍ఎస్‍ ఇవ్వాలి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‍ రమణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‍ భవన్‍లో ఆ పార్టీ సీనియర్‍ నేతలు రావుల చంద్రశేఖర్‍ రెడ్డి, అరవింద్‍ కుమార్‍ గౌడ్‍తో కలిసి గ్రేటర్‍ ఎన్నికల మేనిఫెస్టోను రమణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇష్టానుసారంగా పనులు చేపట్టడంతో రూ.68 వేల కోట్లు ఉన్న అప్పు.. రూ.3.10 లక్షలకు చేరిందన్నారు. హైదరాబాద్‍ను విశేషంగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు.  హామీలను విస్మరించిన టీఆర్‍ఎస్‍ను ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి లేదని సృష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్‍లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిందని రావుల చంద్రశేఖర్‍ రెడ్డి వివరించారు. హ్యాపీ హైదరాబాద్‍ నినాదంతో గ్రేటర్‍ ఎన్నికలు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. టీడీపీకి నమ్మి ఓటేయాలని నమ్మకంగా పనిచేస్తామని రావుల అన్నారు.

 


                    Advertise with us !!!