తెలంగాణలో సినిమాహాల్స్ ఓపెనింగ్ కు గ్రీన్‍సిగ్నల్‍

telangana-permits-opening-of-cinema-theatres-kcr-promises-to-tollywood-in-trs-manifesto

తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు తాజాగా అనుమతించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనుందుకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టికెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమన్యాలకు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‍ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు, శానిటైజర్‍ తప్పనిసరిగా వాడాలి. సినిమా హాళ్ల సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం నిబంధనలు తప్పక పాటించాలి. హాల్‍లో ఏసీ టెంపరేచర్‍ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

 


                    Advertise with us !!!