సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబి లో హైయ్యెస్ట్ రేంజ్ మూవీ : వీళిద్దరి పారితోషికమే 30 కోట్లు

Sukumar to direct Vijay Devarakonda

రొటీన్ కి భిన్నంగా సినిమాలను తెరకెక్కించే సుకుమార్..ప్రస్తుతం టాలీవుడ్ లోమంచి  క్రేజ్ వున్నా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా.. చాలా రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. దానికి సంబంధించిన  బన్నీ రీసెంట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో క్రెజ్ ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టారు.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు సుకుమార్. ఎవరు ఊహించని ఈ సినిమా లాగే బడ్జెట్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఊహించివుండరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి .అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ప్రకటించే సరికి .సాధారణ ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తో  కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్నా పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి.ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు పొందని హైయ్యెస్ట్  పారితోషికం 11 కోట్ల రూపాయల తీసుకుంటున్నాడట. ఈ ఎమౌంట్ కు అదనంగా దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఓ ఫారిన్ కారును కూడా అందుకోబోతున్నాడు. ఇదంతా ప్యాకేజీలో భాగమే.

ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు ఈ దర్శకుడు. దేవరకొండతో చేయబోయే సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అంటే ప్రాజెక్టు బడ్జెట్ లో 30 కోట్లు వీళ్లిద్దరి పారితోషికాలకే సరిపోయింది. ఇక సినిమా మేకింగ్ కు ఇంకెంత ఖర్చవుతుందోనని.. ఆలోచిస్తుంటే ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటు సుకుమార్.. పుష్ప షూటింగ్ పూర్తి అయ్యాక ..ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లనుందని తెలుస్తోంది.  

 


                    Advertise with us !!!