
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుబెబ్బ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాల ద్వారా సమాచారం అందింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేయనున్నారు.