
అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. 24 గంటల్లో 1,72,839 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 1,24,57,447కి చేరింది. 24 గంటల్లో 1,460 మంది చనిపోయారు. వారం రోజుల్లోనే 12 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం... ఆదివారం వరకు 2,55,823 మంది కరోనాతో చనిపోయారు. నవంబర్లో ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నాలుగింట ఒక వంతు మరణాలు (9 శాతం) నవంబర్లోనే నమోదయ్యాయి.
అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 20.9 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 1.95 లక్షల కేసులు రికార్డయ్యాయి. కరోనా వెలుగు చూసిన తరువాత ఒక్క రోజులో నమోదైన కేసులు ఇవే. గడిచిన వారం రోజుల్లో 10 వేల మంది వరకు చనిపోయారు. నెల రోజులతో పోలిస్తే ఈ వారంలో రెట్టింపు మరణాలు సంభవించాయి.