జీహెచ్ఎంసీ బరిలో 1,121 మంది అభ్యర్థులు

1121 contestants to contest in the upcoming GHMC elections

గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎన్నికల బరిలో నిలిచిందెవరో నిష్క్రమించిందెవరో తేలింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక 1,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2,900కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా ఎంతమంది బరిలో నిలిచారనే వివరాలు అర్ధరాత్రి దాటాక వెల్లడయ్యాయి. టీఆర్‍ఎస్‍, బీజేపీ, కాంగ్రెస్‍ దాదాపు 150 డివిజన్లలోనూ అభ్యర్థులను నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది అభ్యుర్థులు, ఎంఐఎం నుంచి సుమారు 50 మంది పోటీలో ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. డివిజన్లు, సర్కిళ్లవారీగా వచ్చిన వివరాలను ధ్రువీకరించుకోవడంలో జాప్యం జరుగుతుతోందని ఎన్నికల విభాగం అధికారి ఒకరు తెలిపారు.

 


                    Advertise with us !!!