టీఆర్ఎస్ తో పొత్తు లేదు

AIMIM has no alliance with TRS in GHMC election

జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍తో తమకు పొత్తు లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‍ ఒవైసీ సృష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు డివిజన్లలో టీఆర్‍ఎస్‍ పార్టీయే తమకు పోటీ అని తెలిపారు. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్‍, బీజేపీ, టీఆర్‍ఎస్‍ల పనితీరుకు, తమకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఏడాదికి 12 నెలల పాటు ప్రజల్లో ఉండి పని చేసే పార్టీ ఎంఐఎం అని, అదే తమ విజయ రహస్యమని అన్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ హైదరాబాద్‍లో వరదలు వస్తే ఎలాంటి సాయం చేయలేదని విమర్శించారు. బెంగాల్‍ అసెంబ్లీ ఎన్నికల పోటీపై అక్కడి పార్టీ వర్గాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 


                    Advertise with us !!!