డిసెంబర్ 13 నాటికి అమెరికాలో కరోనా వ్యాక్సిన్

US could begin COVID-19 vaccinations by December 13

ప్రపంచ దేశాల పై COVID-19 ప్రభావం గురించి ప్రచ్చేకం గా చెప్పనక్కర్లేదు. అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే అమెరికా లో COVID-19 మరణాలు మరియు రోజు వారి కొత్త కరోనా వైరస్ కేసుల నమోదు ఎక్కువగా ఉండడంతో షుమారు 10 నెలలుగా COVID-19 వ్యాక్సిన్ కోసం వివిధ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 13 ఆదివారం నాటికి అమెరికన్లకు COVID-19 వ్యాక్సిన్ అందే మొదటి రోజు కావచ్చు అని అంచనా.

ఫైజర్ మరియు ఫైజర్ జర్మన్ సహకారి బయోఎంటెక్ సంస్థ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) నుండి వారి COVID-19 వ్యాక్సిన్ కోసం అత్యవసర వినియోగ అధికారం కోసం నవంబర్ 20 శుక్రవారం నాడు దరఖాస్తు చేసుకోగా మోడెర్నా సంస్థ తమ COVID-19 వ్యాక్సిన్ ఆమోదం కోసం ఒకటి నుండి రెండు వారాలలో షుమారుగా డిసెంబర్ 4 శుక్రవారం నాటికి FDA కు COVID-19 వ్యాక్సిన్ ఆమోదం కోసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు యుఎస్ఎ టుడే తెలిపింది. FDA COVID-19 వ్యాక్సిన్ అత్యవసర ఆమోద దరఖాస్తు లను ఒకటి నుండి మూడు వారాలలో పరిశీలించి అత్యవసర అధికారాన్ని జారీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే FDA లైసెన్స్ లేదా అత్యవసర వినియోగ అధికారాన్ని జారీ చేయడానికి ముందు వ్యాక్సిన్స్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వైసరి కమిటీ(VRBPAC)  COVID-19 వ్యాక్సిన్ దరఖాస్తును సమీక్షించడం FDA విధానం. VRBPAC బహిరంగ సమావేశాలలో ఫైజర్ COVID-19 వ్యాక్సిన్ నుFDA సిఫారసు చేయాలా వద్దా అనే దానిపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.

ఫైజర్ COVID-19 వ్యాక్సిన్‌ పై VRBPAC సమావేశం డిసెంబర్ 10 గురువారం జరగనున్నట్లు అధికారులు తెలిపారు.  VRBPAC డిసెంబర్ 10 గురువారం న ఫైజర్ COVID-19 వ్యాక్సిన్‌ కు ఓటు వేస్తే VRBPAC నిర్ణయం వెంటనే FDA కి వెళ్తుంది. FDA సిబ్బంది డిసెంబర్ 12 శనివారం నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే డిసెంబర్ 13 ఆదివారం నాటికి అమెరికా ప్రజలకు COVID-19 వ్యాక్సిన్ అందే అవకాశం ఉన్నట్లు యుఎస్ఎ టుడే తెలిపింది.

 


                    Advertise with us !!!