నాట్స్‌ థ్యాంక్స్‌ గివింగ్‌...100 కుటుంబాలకు సహాయం

nats conducted thanks giving programme

ప్రతి యేటా అమెరికాలో నిర్వహించే థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమంలో నాట్స్‌ కూడా పాలుపంచుకుంది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమెరికాలో పెద్దఎత్తున చేస్తారు. తెలుగువారికి అండగా ఉంటున్న నాట్స్‌ కమ్యూనిటీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్‌ టెంపా విభాగం టెంపాలో థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 100 కుటుంబాలకు ఆహారం, నిత్యావసరాలను నాట్స్‌ అందించింది.  ఐటీ సర్వీసెస్‌ అలయన్స్‌ ఫ్లోరిడా విభాగం మరియు బటర్‌ ఫ్లై ఫార్మసీ తో కలిసి నాట్స్‌ ఈ థాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

రామ పిన్నమనేని, డాక్టర్‌ విజయ్‌, ఫణి దలయ్‌, సోమంచి కుటుంబంతో పాటు  డాక్టర్‌ సుదర్శన్‌, రామ కామిశెట్టి ఈ కార్యక్రమానికి ప్రదాన దాతలుగా తమ సాయం అందించారు. బటర్‌ ప్లై ఫార్మసీ నుంచి టోనీ జన్ను, టూటూ జన్ను టీం ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. నాట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ ప్రశాంత్‌ పిన్నమనేని, నాట్స్‌ టెంపా విభాగం సమన్వయకర్త ప్రసాద్‌ అరికట్ల, నాట్స్‌ టెంపా బే జాయింట్‌ కో ఆర్డినేటర్‌ సురేశ్‌ బొజ్జ, ఐటీ సర్వీసెస్‌ అలయన్స్‌ ఫ్లోరిడా విభాగం ప్రెసిడెంట్‌ భరత్‌ ములపురు, నాట్స్‌ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ కండ్రు, నాట్స్‌ టెంపా కోర్‌ టీం అచ్చిరెడ్డి శ్రీనివాస్‌, ప్రభాకర్‌ శాకమూరి, సతీశ్‌ పాలకుర్తి,  భాస్కర్‌ సోమంచి, నవీన్‌ మేడికొండ, భార్గవ్‌ మాధవ్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. 

నాట్స్‌ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ ప్రశాంత్‌ పిన్నమనేని, నాట్స్‌ ఫైనాన్స్‌/ మార్కెటింగ్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ మల్లాది, నాట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వెబ్‌ సెక్రటరీ సుధీర్‌ మిక్కిలినేని, నాట్స్‌ మాజీ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివ తాళ్లూరి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు  తమ వంతు సహయ సహకారాలు అందించారు. ఇలాంటి కార్యక్రమ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన నాట్స్‌ ఛైర్మన్‌ శ్రీథర్‌ అప్పసాని, నాట్స్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ శేఖర్‌ అన్నేలకు నాట్స్‌ టెంపా విభాగం ధన్యవాదాలు తెలిపింది.