వెస్ట్‌ ఛెస్టర్‌లో తానా ఫుడ్‌ డ్రైవ్‌

tana food drive in westchester

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నిరుపేదల సహాయార్థం తానా కేర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా వెస్ట్‌ ఛెస్టర్‌లోని వెస్ట్‌ ఛెస్టర్‌ ఫుడ్‌ కప్‌బోర్డ్‌కు ఆహారపదార్థాలతోపాటు, పర్సనల్‌ కేర్‌ ఐటెంలను పంపిణీ చేశారు. తానా నాయకులు రవి పొట్లూరి, రవి మందలపు, నాగరాజునలజుల, సునీల్‌ కోగంటి ఇచ్చిన విరాళాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఫుడ్‌ ఐటెమ్స్‌ విరాళంగా ఇచ్చినందుకు వెస్ట్‌ ఛెస్టర్‌ ఫుడ్‌బోర్డ్‌ తానాకు ధన్యవాదాలను తెలియజేసింది.