వీరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం...

GHMC polls Persons with disabilities can opt for postal ballot

గ్రేటర్‍ హైదరాబాద్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ (జీహెచ్‍ఎంసీ) ఎన్నికల్లో కొవిడ్‍ బాధితులు, వికలాంగులు, వృద్ధుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‍ఈసీ) పలు వెసులుబాట్లు కల్పించింది. కరోనా పాజిటివ్‍ నిర్ధారణ అయిన వారు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకోవచ్చని బాధితులకు తెలిపింది. ఫేస్‍ మాస్క్, షీల్డ్, గ్లవ్స్ ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్‍ కేంద్రాలకు రావాలని సూచించింది. వికలాంగులు, వృద్ధులు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‍తో సంబంధం లేకుండా నేరుగా వచ్చి ఓటు వేయవచ్చని సృష్టం చేసింది.

వికలాంగులు, 80 ఏళ్ల పైబడిన వారు, కరోనా పాజిటివ్‍ బాధితులకు పోస్టల్‍ బ్యాలెట్‍ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎస్‍ఈసీ పేర్కొంది. వీరంతా నేరుగా పోలింగ్‍ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో పోస్టల్‍ బ్యాలెట్‍ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది. అలాగే పోలింగ్‍ కేంద్రాల్లో వికలాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉన్నాయని, వాటిని తీసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వివరించింది.