కర్నూలులోని పుష్కరఘాట్ల వద్ద తానా అన్నదానం

Tana Annadanam at Tungabhadra Pushkar Ghats in Kurnool

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాలు ఆచరించే భక్తుల కోసం కర్నూలులోని పుష్కరఘాట్ల వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగే ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు మున్సిపల్‌ కమీషనర్‌ డీకే బాలాజీ ఐఏఎస్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే భక్తులందరు మాస్కులు ధరించడం, సామాజిక   దూరం పాటించడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమీషనర్‌ కోరారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పుష్కరాలు ముగిసేవరకు జరుగుతుందని బాలాజీ క్యాంటీన్‌ అధినేత ముప్పా రాజశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సందడి మధు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery